లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి

పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది.

లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ నుండి తెరాస లోకి వలస వెళ్లిన వాళ్ళపైన విమర్శలు గుప్పించేసారు.వెళ్లిన వాళ్లంతా పచ్చి అవకాశం వాదులని తామే ఇంకో రెండున్నరేళ్లలో సత్తాచాటుతామని మేకపోతు గాభీర్యాలు ప్రదసించే ప్రయత్నం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితాలు రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకే కాదు ఏ వర్గానికి కూడా అందలేదని వాపోయారు పాపం.

పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి విధివిధానాలు లేవని(ఈ మాట కాంగ్రెస్ కురువృద్దులు అనడం హాస్యాస్పదం),2013 నాటి భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.భూసేకరణ చట్టం అమలు చేయకుంటే నిరసనలు చేపడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని హెచ్చరించేసారు.కామెడీ కాకపోతే ఎన్నాళ్ళనుండి మల్లన్న సాగర్ వివాదం కొనసాగుతోంది?అప్పుడెప్పుడూ నోరుమెదపని ఈ సీనియర్ అంత సద్దు మునుగుతున్న సమయం లో నిరసన కోర్టు అంటే ఏం లాభం రెడ్డి గారు.

తెలంగాణా ఇచ్చిన ఘనత నిర్వివాదంగా కాంగ్రెస్ దే.అయినా రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పరిస్థికి అద్వాన్నంగా తయారయ్యింది.దీనికి ముఖ్య కారణం సీనియర్ నాయకుల్లో కొరవడిన సమన్వయమే.ఎవరికి వారే యమునా తీరే అన్న చందాగా వ్యవహరించడం తప్ప పార్టీ బలోపేతానికి కృషి చేసేవాళ్ళే కరువయ్యారు.ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే నాయకత్వం లేదు పార్టీ లో.ఎంత సేపు అంతర్గత కుమ్ములాటలు,రాజకీయ ఎజండాయే ప్రధానంగా పని చేస్తారు తప్ప ప్రజాసమస్యలపై కాదు.అయినా జైపాల్ రెడ్డి ఈ మాత్రం అయినా మేలుకోవడం స్వతాహాగానా లేక ఇది కూడా హై కమాండ్ ఏమైనా అక్షింతలు వేస్తే జరిగిందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.