బాబుకు మోడీ ర్యాంక్ ఎంతో తెలుసా?

కేంద్రం నుంచి..ఆశించిన నిధులు రావడం లేదు…పోనిలో ఏదో చేసి నిధులు కోసం  వెతుకుతున్న మోడీ సర్కార్  నుంచి ఆశించిన ఫలితం రావడం లేదని సీఎం బాబు తెగ ఫీలైపోతున్నారు…ఇంతకీ…కధ ఏంటంటే…  సీఎం ర్యాంక్స్ లో బాబుపని తీరుకు ప్రధాన మంత్రి ఐదో ర్యాంక్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా అధికారుల వద్ద ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా వారికి ర్యాంక్‌లు కేటాయిరచాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. అందుకు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కొత్త విధానాలు, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పైనా ఆరా తీస్తున్నారు. దీనిపై ఈనెల 16న ముఖ్యమంత్రు లతో ఒక కీలక సమావేశాన్ని మోడీ నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ సమావేశాన్ని 11 లేదా 12న నిర్వహిరచాలని భావించారు. కానీ కొందరు ముఖ్యమంత్రులు అందుబాటు కాకపోతుండటం వల్ల తేదీని మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసమే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ జాబితాలో చంద్రబాబుకు ఐదో స్థానం దక్కినట్లు తెలుస్తోరది. దీనిపై ముందుగానే గానే చంద్రబాబుకు కూడా సంకేతాలు అందినట్లు తెలిసిరది. తనకు ఐదో ర్యాంకు రావడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఎంతో కష్టపడి పనిచేస్తున్నా, కేంద్రం ఐదో రాంక్‌ ఇస్తోరదని, ఇది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించినట్లు  ప్రచారం.

రాష్ట్రంలో అనేక విధానాల అమలులో తానే నంబర్‌-1 అని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌, రాజధాని నిర్మాణానికి అవలంబించిన భూ సమీకరణ, సిఎం డాష్‌బోర్డు, ఇంటింటికి ఇరటర్నెట్‌, బెస్ట్‌ ఇన్నోవేషన్స్‌, స్మార్ట్‌ వార్డు, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాలు, ఎల్‌ఇడి బల్బుల పంపిణీ అంశాల్లో తాను కొత్త పంథా తొక్కుతున్నట్లు ఆయన చెబుతుంటారు. తానే బెస్ట్‌ అని కూడా చంద్రబాబు అంటున్నారు.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కేంద్రం, ప్రపంచ బ్యాంకు బృందం సంయుక్తంగా ఇస్తున్న రాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలూ చాలాకాలం వరకు తొలి రెండు స్థానాల కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఈ సమయంలోనే మోడీ ర్యాంకుల జాబితాలో ఐదో స్థానం ప్రచారాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది.ఈనెల 16న జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఉత్తమ విధానాలను స్వీకరిరచడమే కాకుండా ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను కూడా ప్రకటించే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఆలోగా జాబితాలో తన నంబర్‌ ఎగబాకుతురదన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు.