చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్

ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే.

రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన ఆగిపోయింది.దీనికి కారం చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్పాలా!ఎందుకంటే, చంద్రబాబు విధానాలపై, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై వీర్రాజు ఒంటికాలిపై లేస్తున్నారు. ఒక విధంగా చంద్రబాబు కంట్లో వీర్రాజు నలుసులాగ తయారయ్యారు.ఇది సహించలేని వీర్రాజు వ్యతిరేక వర్గం చంద్రబాబుతో కుమ్మక్కై అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటనను నిలుపుదల చేయిస్తోందని ప్రచారం.

వీర్రాజు వ్యతిరేక వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు పుష్కలంగా ఉన్నాయని, సిఎంకు మద్దతుగానే కొత్త అధ్యక్షుని ప్రకటన జాప్యం జరుగుతోందని సమాచారం.కేంద్రంలోని బీజేపీ జాతీయ నాయకత్వం మీద రెండు రాష్ట్రాల్లోని పార్టీ నేతల ప్రభావం కన్నా అధికార పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులైన కెసిఆర్, చంద్రబాబుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది.

అయినా విమర్శించే వారిపై ఎదురుదాడి చేయడం..పత్రికా స్వేచ్చని హరించేయడం ఆంధ్రప్రదేశ్ లో మనకు కొత్తేమి కాదు.దీనికి Ntv కొమ్మినేని శ్రీనివాస్ రావు,సాక్షి పత్రికలే సాక్ష్యాలు.ఇప్పుడు వీర్రాజు వంతొచ్చింది అంతే.అయినా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించాలి,సొంతంగా పార్టీ బలపడాలి అని కలలుగంటున్న బీజేపీ కి పక్క పార్టీ అధ్యక్షుడు కనుసన్నల్లో పార్టీ నడుస్తోందని తెలుసుకోలేక పోవడం వారి రాజకీయ అజ్ఞానమనే అనాలి!