ఆప్ వీడియో..వీళ్ళు రచ్చ ..మనకు చిప్ప

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొంచిందన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం.ఇప్పటికే ప్రత్యేకహోదా పైన ఆశలు వదులుకున్న ప్రజానీకానికి ప్రయివేట్ మెంబెర్ బిల్ రూపం లో KVP కొత్త ఆశలు చిగురింపచేసాడు.అసలు సాంకేతికంగా చూస్తే ప్రయివేట్ మెంబెర్ బిల్లులు ఇప్పటివరకు ఏవీ కార్య రూపం దాల్చకపోయినా కనీసం ఏదో కొంత ఒత్తిడైనా కేంద్రం పైన తేవడానికి ఈ బిల్లు ముమ్మాటికీ ఎంతో ఉపయోగపడుతుందన్నది కాదనలేని వాస్తవం.

మానం ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలిచి నట్లు,ఈ రోజే పార్లమెంట్ లో ఢిల్లీ కి చెందిన ఆప్ భగవంత్ లోక్ సభలో లో తీసిన వీడియో కలకలం సృష్టించింది.దీనిపై బీజేపీ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింపచేశారు.అయితే రాజ్యసభలో మొత్తం ఈ రోజు 15 పైగా బిల్లులు చర్చకు అనుమతినిచ్చారు.అందులో మొదట ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా బిల్లే వుంది.అయితే అనూహ్యంగా..బీజేపీ తెరవెనుక చక్రం తిప్పింది.ఆప్ ఎంపీ భగవంత్ మన్ వివాదాన్ని సాకుగా చూపి మన బిల్లుని 14 వ స్థానానికి నెట్టేసింది.

ఇంకేముంది ఉన్న కాలం కాస్త బీజేపీ సభ్యులు పోడియం ముందుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు ,ఆప్ ఎంపీ భగవంత్ మన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం తోనే సరిపోయింది.అయినా లోక్ సభలో జరిగిన అంశాన్ని రాజ్య సభలో గందరగోళం చేస్తూ బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేకహోదా బిల్లు చర్చకు రాకుండా అడ్డుపడింది.

దీనిపై ఎవరికీ వారే అవతలివాళ్ళకి మసిపూసి పనిలో పడ్డారు.టీడీపీ ఎంపీ లు ఈ విషయం లో బీజేపీ ని పల్లెత్తు మాట కూడా అనకుండా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ అసలు ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ అడ్డు అంటూ వితండ వాదం చేయగా..కాంగ్రెస్ మాత్రం మేము హామీ ఇచ్చాము కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా అమలు చేయకుండా ఏపీ కి అన్యాయం చేస్తోంది బీజేపీ అని మండిపడుతోంది.కాగా వైస్సార్సీపీ మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా మా మద్దతు ఉంటుందంటోంది.ఈ రాజకీయ చదరంగం లో,చిత్త శుద్ధి లేని రాజకీయాలతో అసలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం మసకబారి మరుగునపడిపోయి.. కాలగర్భం లో కలిసిపోవాల్సిందే!