ముద్రగడ దీక్ష..సెకండ్ రిలీజ్!!

ఆరునెలల క్రితం వరకు ఆయనెవరో ఎవరికీ పెద్దగా తెలీదు.అంతలోనే కాపులను వుద్దరించేస్తానని కాపు జాతికి తానే బ్రాండ్ ఐకాన్ అని సెల్ఫ్ డబ్బా కొట్టేసి ఎడా పెడా వివాదాలు రేపుతూ వార్తల్లో నిలుస్తు హల్చల్ చేసేస్తున్నాడు. ఖాళి సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకున్నంత వీజీగా ఈయన దీక్షలపై దీక్షలు చేస్తున్నారు.అంతేనా పోలిసోల్లు కనబడితే చాలు నన్ను అరెస్ట్ చెయ్యండి మొర్రో అని మొత్తుకుంటున్నాడు.అరెస్ట్ లన్నా పోలిసులన్నా ఆయనకి మహా సరదా.

సినిమాల్లో బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు మళ్లీ మళ్లీ రిలీజ్ చేస్తూ సెకండ్ రిలీజ్ అంటుంటారు. ముద్రగడ కుడా అచ్చం సినీ పక్కిలో మళ్లీ ఆమరణ నిరాహార దీక్షా చేస్తున్ననంటూ నానా హంగామా సృష్టిస్తున్నాడు. కాకపోతే ఈ సెకండ్ రిలీజ్ లో కొన్ని అదనపు సన్నివేశాలు జత చేసారు అవేంటంటే ఈ సారి ముద్రగడ ఇంటి లోపలికి పోలీసులు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ… దాన్ని తాగుతానని హెచ్చరికలు చేశారు. ఆయను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిచాగా ఆగ్రహించిన ముద్రగడ ఇంటి లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం ఈ సెకండ్ రిలీజ్ దీక్షలో హైలైట్. ఇక షరా మాములుగా కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు.తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు.ఎవరిజీవితాలతో ఎవరు ఆడుకున్తున్నర్రా బాబు అని పోలీసులు తలలు పట్టుకున్నారు. చేసేదేమిలేక ముద్రగడ అరెస్ట్ ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు.

ఈయనగారికి మూడ్ కాచ్చినప్పుడల్లా దీక్ష అంటుంటే ప్రభుత్వమేమో సెక్షన్-30 అని ఇంకోటని జిల్లమొత్తం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు మినహా గ్రామంలోకి ప్రైవేటు వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. గ్రామానికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నారు పోలీస్ బాస్ లు. ముద్రగాడా ఈ డ్రామా ఇప్పట్లో ఆపడు,ప్రభుత్వమా ఏదీ తెల్చదు పైగా ముద్రగడపై తెగించి ఏదో ఒక చర్య తీసుకుందామంటే కుల రాజకీయాలు వాటి సమీకరనాలపైనే శ్రద్ద ప్రభుత్వానికి. ఈ మొత్తం వ్యవహారం లో నలిగిపోతోంది మాత్రం అటు పోలీసులు ఇటు సామన్య ప్రజానీకమే.