న‌ల్గొండ బాధ్య‌త‌లు ఉత్త‌మ్‌కి.. ప‌ద‌వికి ఎస‌రేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు మిత్రులో ఎవ‌రు శ‌త్రువులో చెప్ప‌డం క‌ష్టం. అయిన వాళ్లు.. నిన్న‌టి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వ‌స్తే.. ఎక్కేయ‌డానికి, ఏకేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయ‌నపై గ‌తం కొంత కాలంగా స్థానిక నేత‌ల్లో చాలా మందికి ప‌డ‌డం లేదు. అటు పార్టీ ప‌రంగా కావొచ్చు, ఇటు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప‌రంగానూ కావొచ్చు. […]

ఆ రెడ్డి నాయ‌కుడే టి కాంగ్రెస్ సీఎం?!

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం.. అన్న‌ట్లు ఉంది టికాంగ్రెస్ ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మయం ఉండ‌గానే.. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైపోయింది. సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్న‌పాలు కూడా వెళుతున్నాయ‌ట‌. అంతేగాక సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో తేలితేగాని ఒప్పుకోమని కార్య‌కర్త‌లు కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. మ‌రి నాయ‌కులే తొంద‌ర‌ప‌డుతున్నారో.. లేక కార్య‌క‌ర్త‌లే తొంద‌ర ప‌డుతు న్నారో తెలియ‌దు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ […]

హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ

తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేక‌పోయినందుకు ఒక‌ప‌క్క హైక‌మాండ్ తీవ్ర మ‌థ‌న‌ప‌డుతుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి కొంత‌వ‌ర‌కైనా స్వాంత‌న చేకూర్చాల‌నే అభిప్రాయం ఏ ఒక్క‌రిలోనూ క‌నిపించ‌డంలేదు. ఆధిప‌త్య పోరుతో నాయ‌కులు.. ఒక‌డుగు ముందుకు వంద‌డుగులు వెనక్కి వేస్తున్నారు. క‌ల‌సిక‌ట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డం మాని,,ఎవరికి వారు త‌మ స్వలాభాన్ని చూసుకుంట‌న్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది. దీంతో […]

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చిందా!

వారు ముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు! అయితేనేం ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి! ఒక‌రితో ఒక‌రికి పొంత‌న ఉండ‌దు. ఎప్పుడూ క‌లుసుకోరు.. క‌లిసినా మాట్లాడుకోరు!! అలాంటి వారు ముగ్గురూ విభేదాలు ప‌క్క‌న పెట్టారు. శ‌త్రుత్వాన్ని మరిచి.. పార్టీ కోసం చేయీచేయీ క‌లిపారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు క‌లిసి భోజ‌నం చేశారు! ఆ నేత‌లే జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి!! తెలంగాణ‌లో ఇచ్చినా ఆ క్రెడిట్ సంపాదించుకోలేక […]