చిన్న‌మ్మకు ఊహించ‌ని షాకిచ్చిన ప‌ళ‌ని

న‌మ్మిన బంటును సీఎం పీఠంపై ఉంచి.. జైలు నుంచే త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావించిన శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. త‌న మాటే శాసనంగా ప‌నిచేస్తార‌ని భావించిన వ్య‌క్తి.. ఆమెకు దిమ్మతిరిగి పోయాలా చేశారు. `నేను రిమోట్ ద్వారా ప‌నిచేసే ముఖ్య‌మంత్రిని కాదు` అంటూ.. చిన్న‌మ్మ‌కు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు పళ‌నిస్వామి! ఏ రాజ‌కీయ అనుభ‌వం లేని శ‌శికళ మాట త‌నెందుకు వినాలని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శ‌గా తాను చెప్పిన వ్య‌క్తిని నియ‌మించాల‌ని శ‌శిక‌ళ పంపిన ఆదేశాలు..పాటించ‌న‌ని స్ప‌ష్టంచేశారు. పాల‌న‌తో […]

త‌మిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. త‌మిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని త‌ల‌పించేలా జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో పైకి ప‌న్నీరు సెల్వం ఓడిన‌ట్లు క‌నిపిస్తున్నా ఓవ‌రాల్‌గా మాత్రం […]

శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌…సీఎం రేసులో దీప‌క్‌

త‌మిళ‌నాడు సీఎం అయ్యేందుకు జ‌య నెచ్చెలి శశిక‌ళ గ‌త కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శ‌శిక‌ళ‌తో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]

ప‌న్నీర్ వ‌ర్గంపై వేటుకు శ‌శిక‌ళ వ్యూహం

త‌మిళ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ, జ‌య న‌మ్మిన‌బంటు, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వానికి మ‌ధ్య పోరు తీవ్ర‌మవుతోంది. రోజులు గ‌డిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో శ‌శి శిబిరంలో అల‌జ‌డి రేగింది. అయితే ప‌న్నీర్ వ‌ర్గానికి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇస్తే ఏమిట‌న్న విష‌యంపై శ‌శిక‌ళ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేలు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శ‌శిక‌ళ‌ సిద్ధ‌మ‌వుతున్నారు. […]