కాపుల ఉద్యమానికి ఇక KCR ఆయుధం!!

తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ ముక్యంగా KCR వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి […]

ముద్రగడ మొత్తానికి మొండోడే!!

ముద్రగడ ఎపిసోడ్-1 కి 2 కి తత్త్వం బోధపదినట్టుంది.మొదటి సారి దీక్షలో తు తు మంత్రంగా దీక్ష చేసి ప్రభుత్వ దూతలు రాగానే చర్చలు అని కాలక్షేపం చేసి జ్యూస్ తాగేసి దీక్ష విరమించెసి అభాసు పాలయ్యారు.ఈ సారి అలా కనిపించడం లేదు కాస్తా మొండిగానే వున్నట్టు కనిపిస్తోంది దీక్ష. తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని ముద్రగడ […]

ముద్రగడ హెల్త్ బులిటెన్ – కాపు మీటింగ్ – ప్రభుత్వం లో టెన్షన్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుంది. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు డా.రమేష్ కిషోర్, డా.విజయేంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ముద్రగడ దీక్ష 105గంటలకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలకు ముద్రగడ అనుమతించలేదని డాక్టర్ల బృందం స్పష్టం చేసింది ముద్రగడ చూసేందుకు బాగానే వున్నా ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం నీళ్లు త్రాగుతున్నారని తెలిపారు. బిపీ […]

కాపులంతా ఒక్కటైతే, చంద్రబాబు పరిస్థితేంటి?

కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్‌. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్‌. సినీ రంగం నుంచి […]

ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?

కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]

ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..

ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్ర‌గ‌డ దీక్ష‌కు దిగిన సంద‌ర్భంగా పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌పై వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు క‌క్ష సాధింపు చ‌ర్య‌లా ఉంద‌ని […]