కేంద్రంలో కొత్త మంత్రుల హిస్ట‌రీ ఇదే..

కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీర‌బోతున్న మంత్రుల‌కు అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాల‌కు మోడీ త‌న టీంలో చోటు క‌ల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. మ‌రి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్‌ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా […]

వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు […]

బాబుపై తీవ్ర అసంతృప్తితో క‌మ్మ క్యాస్ట్ ప్ర‌జాప్ర‌తినిధులు

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు తీరుపై ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జాప్ర‌తినిధులు, సీనియ‌ర్ నేత‌లు గుస్సా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చంద్ర‌బాబు ఇవ్వాల్సిన ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు అయితే బ‌హిరంగంగానే బాబుపై త‌మ అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చంద్ర‌బాబు క‌మ్మ క్యాస్ట్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌పాటి వ్యాఖ్యలు ఆ […]

ఫిరాయింపే బాబు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వికి అర్హ‌తా..!

టీడీపీలో మంత్రివ‌ర్గ విస్త‌`ర‌ణం` మొద‌లైంది. అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌లు, సుదీర్ఘ మంత‌నాలు, సామాజిక‌వ‌ర్గాల కూడిక‌లు, తీసివేత‌లు వీట‌న్నింటినీ లెక్క‌లోకి తీసుకుని చివ‌ర‌కు 11 మందితో కూడిన మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. ఐదుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న పలికారు. వారి ప‌నితీరు, సామాజికవ‌ర్గం.. వీట‌న్నింటినీ అర్హ‌త‌లుగా ప‌రిగ‌ణించిన బాబు.. కొత్త మంత్రుల ఎంపిక‌లో `ఫిరాయింపుదారుల‌`కే అధికంగా ప‌ట్టం క‌ట్ట‌డాన్ని ఇప్పుడు పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ మార‌డ‌మే మంత్రి ప‌ద‌వికి అర్హ‌త అనేలా అధికంగా వారికే ఎక్కువ‌గా మంత్రి ప‌దవులు […]

బాబు దూకుడుకు బ్రేక్ వేసిన న‌ర‌సింహ‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించ‌కుండా వారికి మంత్రి ప‌దవుల్ని క‌ట్ట‌బెట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. త‌న‌లో ఉన్న రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయినా.. తాను మాత్రం మ‌రిచిపోలేద‌ని స్ప‌ష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కేక‌లు, నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన […]