జ‌న‌సేన నుంచి ఫార్టీ ఇయ‌ర్స్ పృథ్వీ పోటీ చేసేది అక్క‌డేనా…!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఎవ‌రు ఎవ‌రికీ శ‌తృవులు కూడా కాదు. ఒక‌ప్పుడు.. నోరు పారేసు కున్న నాయ‌కులే.. త‌ర్వాత కాలంలో అదే పంచ‌న చేరిపోవ‌డం.. రాజ‌కీయాల్లో త‌ప్ప ఇంకెక్క‌డైనా సాధ్య‌మేనా? అంటే.. కాద‌నే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్ట‌ర్ న‌టుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. అమ్మ‌నా బ‌త్తాయ్ డైలాగుల‌తో వెండితెర‌ను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జ‌న‌సేన పంచ‌న చేరేందుకు […]

సత్తెనపల్లి నాదే అంటున్న శివరాం.!

కోడెల శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లి సీటు విషయంలో చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. 2009 వరకు నరసారావుపేట అసెంబ్లీలో సత్తా చాటిన కోడెల…2014లో పొత్తులో భాగంగా పేట సీటు..బీజేపీకి వెళ్ళడంతో కోడెల…సత్తెనపల్లి సీటు లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో అక్కడ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల…అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పలు కారణాల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కోడెల […]

బాబు ఎఫెక్ట్: రేవంత్‌కు రిస్క్?

తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడో వైదొలగిన విషయం తెలిసిందే..2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడం మానేశారు. అలాగే ఏపీలో కూడా ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితం కావడంతో..పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టి…బాబు పనిచేస్తున్నారు. అసలు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు. అయితే బాబు తెలంగాణ జోలికి వెళ్లకపోయినా సరే…ఏదొక సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బాబు పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు […]

బీజేపీతో బాబు..జగన్ సేఫ్?

ఎట్టకేలకు చంద్రబాబు…బీజేపీకి దగ్గరయ్యే మార్గం సుగమమైంది..ఇంతకాలం బీజేపీకి చేరువ కావాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా ఉన్నాయి. తాజాగా ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో పాల్గొన్న బాబుకు…మోదీ, అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులని కలుసుకునే అవకాశం వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత బాబు…మోదీని కలవడం ఇప్పుడే. అయితే కేంద్రం సపోర్ట్ ఉంటే…నెక్స్ట్ ఎన్నికల్లో తమకు బెనిఫిట్ అవుతుందని బాబు భావిస్తున్నారు…సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో గత ఎన్నికలు నిరూపించాయి. అందుకే అప్పటినుంచి కేంద్రం సపోర్ట్ కోసం బాబు […]

మోదీతో బాబు…సెట్ అయినట్లేనా?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు బాబు ఒక ధోరణిలో ముందుకెళ్లగా…ఎన్నికల తర్వాత మరొక వర్షన్..అసలు ఎన్నికల ముందు చంద్రబాబు…కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదని చెప్పి…బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. అలాగే మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. […]

మునుగోడు రాజ‌కీయం మారిందా… ఆ పార్టీకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా ..!

ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయిన‌ట్లేనా..? ఇక అక్క‌డ ఆ పార్టీ పుంజుకోవ‌డం అసాధ్య‌మేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడ‌ర్ ఉన్నా నేత‌లు హ్యాండివ్వ‌డంతో ఆ లోటును ఇప్ప‌ట్లో పూడ్చ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు ఆ పార్టీ నేత‌లే వెలిబుచ్చుతున్నారు. రాజ‌గోపాల రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై గ‌త మూడేళ్ల నుంచీ అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీలో త‌న‌కు, త‌న కుటుంబానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న […]

మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]

సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]

జ‌గ‌న్‌కు యాంటీగా అనుకూల మీడియా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం. […]