రజని దెబ్బకి అల్లడుతున్నారట

తెలుగు నాట లక్ష్మీగణపతి ఫిలిమ్స్ తెలియని వాళ్ళుఉండరు ఎందుకంటే ఒకప్పుడు ఏ డబ్బింగ్ సినిమా వచ్చినా ఇంటింటా ప్రతి టీవీ ఛానల్ లో యాడ్స్ తో అదరగొట్టేసేవాళ్ళు అంత సూపర్ ఫేమస్ అయిన లక్ష్మీగణపతి ఫిలిమ్స్ కొన్నేళ్లుగా ఆ సంస్థ కనబడకపోవటానికి కారణమేమిటో తెలుసా … రజనీకాంత్‌ సినిమా ‘కొచ్చాడయాన్‌’ తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ కొని వారు పెద్ద తప్పే చేశారు. ఆ సినిమా మిగిల్చిన నష్టాలకి ఇప్పటికీ వారు కోలుకోలేదు. ఆతర్వాత వచ్చిన లింగా కూడా […]

మరో మల్లన్నసాగర్‌ గా తయారవుతున్న ఫార్మా సిటీ…

ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో  12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు  జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా […]

జ్యోతి లక్ష్మీ కన్నుమూత

300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మీ పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ […]

కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య మరో వివాదం

దేశ రాజధాని ప్రాంతం పరిపాలనాధిపతిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొనసాగుతారని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండనక్కరలేదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఫైళ్లను తనకు పంపించాలని ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. ఫైళ్ల వివరాలన్నింటినీ నజీబ్ జంగ్ కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన […]

జీఎస్టీ సవరణలకు లోకసభ ఓకే

చరిత్రాత్మక పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ సవరణ బిల్లును లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది జీఎస్టీ బిల్లును లోక్ సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో గతవారం నాలుగు సవరణలతో బిల్లు పాస్ అయింది. తాజాగా లోక సభ కూడా ఆమోదించడంతో…. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది. జీఎస్టీ రాజ్యాంగ 122వ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. 443 అనుకూల ఓట్లతో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లులోని సవరణలను సభ ఆమోదించింది. సవరించిన బిల్లును మధ్యాహ్నం లోక్ […]

ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు

ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్‌ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ స్టార్‌ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్‌ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్‌ లైన్‌ మార్చినట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్‌ సూపర్‌స్టార్‌. తమ స్టార్‌ హీరోని […]

ఇద్దరూ కావాలంటున్న చైతూ

నాగ చైతన్య సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెఢీగా ఉన్నాయి. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఒక నెల గ్యాప్‌లో రెండో సినిమా ‘ప్రేమమ్‌’ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపల చైతూ మరో కొత్త సినిమాకి సైన్‌ చేశాడన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో నాగార్జునకి రొమాంటిక్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో చైతూ […]

పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం

పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల […]

సివిల్స్ టెస్ట్ లో మోడీ జపం

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ ప‌రీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల‌కు నిజ‌మైన ప‌రీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించే 13 కావ‌డం గ‌మ‌నార్హం. ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, స్టాండ‌ప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజ‌న‌, స్ట‌డీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫ‌ర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్‌, ప్రధాన‌మంత్రి ముద్రా యోజ‌న‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ల‌పై ప్రశ్నలు అడిగారు. వీటిపై చాలామంది అభ్యర్థులు మండిప‌డుతున్నారు. ఆధునిక చ‌రిత్ర‌, […]