ఈ ఫొటో లో చిరంజీవితో ఉన్న అమ్మాయి ఇప్పుడో స్టార్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..!

సోషల్ మీడియా కారణంగా ఎప్పుడో ఇండస్ట్రీని విడిచిపెట్టిన వాళ్ళ ఫోటోలు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు కూడా బయటకి వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నవాళ్లు తర్వాత పెద్ద హీరోయిన్లు కావడం లేదంటే అనేక రంగాల్లో ఎదగడం వంటివి చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఈమె ఎవరో కాదు” దేవుళ్ళు ” అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్యా శెట్టి. దేవుళ్ళు సినిమాలో తల్లిదండ్రులు కలవడానికి దేవుళ్ళ గుళ్లను ఈమె తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఈమె అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ అంజి సినిమాలో కూడా చెడు లాటిస్ట్ గా నటించింది. ఇక ఆ తర్వాత అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇక అనంతరం చదువు నిమిత్తం సినిమాలకి బ్రేక్ ఇచ్చి తరువాత స్టడీస్ లో బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా మారింది. పిట్ట కథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి మంచి అవకాశాలు వస్తే మాత్రం తన సత్తా చూపించుకోవడానికి రెడీగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.