పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఆ స్టార్ హీరోకి మరదలా.. ఇన్నాళ్లకు రివీలైన సీక్రెట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా జన సేన పార్టీని గెలిపించాలని ఉద్దేశంతో ఎన్నికలపై పూర్తి దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. సెట్స్‌ పై ఉన్న తన సినిమాలు ఉస్తాద్‌ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను కూడా పోస్ట్ పన్‌చేశాడు. అయితే ఈయన రాజకీయాల్లో రాణిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి విమర్శలు చేయడానికి ఎటువంటి సాగు దొరకనప్పుడు.. ఈయన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తూ పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొడుతూ ఉంటారు. ఇక వాళ్లు మూడు పెళ్లిళ్ల గురించి ఎత్తినప్పుడల్లా పవన్ కళ్యాణ్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు.

Nandini (Pawan Kalyan's Wife) Age, Family, Biography & More » StarsUnfolded

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మూడో భార్య రష్యన్ యాక్ట్రెస్ అనాలెజినోవా అందరికీ తెలుసు. ప్రస్తుతం ఈమె పవన్ దగ్గర ఉంటుంది. ఇక రెండో భార్య రేణుదేశాయ్‌.. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఈమె మాజీ హీరోయిన్. ఇక మొదటి భార్య నందిని గురించి చాలామందికి తెలియదు. పవన్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ లో నందిని కి, పవన్ కి మధ్య పరిచయం ఏర్పడిందట. అది ప్రేమగా మారడంతో వీరిద్దరూ వీరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఇటీవల నందిని గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Pawan Kalyan's two failed marriages to his secret wedding with Anna  Lezhneva; A look at Power Star's love life | PINKVILLA

పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ నందినికి అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి దూరపు బంధుత్వం ఉందట. నందిని తాత అక్కినేని నాగేశ్వరరావు తండ్రికి మధ్య మంచి చుట్టారికం ఉందని తెలుస్తుంది. నందిని నాగార్జునకి వరుసకు మరదలు అవుతుందని సమాచారం. ఇక సినీ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని నందినికి అక్కినేని ఫ్యామిలీతో ఇలాంటి దూరపు బంధుత్వం ఉందని చాలామందికి తెలియదు. వీరి పెళ్లిలో అక్కినేని నాగేశ్వరరావు పవన్ దగ్గరకు వెళ్లి మరి వారి మధ్య ఉన్న బంధుత్వాన్ని చెప్పారట. అలాగే ఈ జంట విడాకులు తీసుకున్న సమయంలో కూడా అక్కినేని ఎంతో సర్ది చెప్పాలని ప్రయత్నించారని.. ఆ జంట వినలేదని టాక్‌.