తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వివాహం చేసుకున్న జంటలో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి జంట ఒకటి. వీరు ఈ ఏడాది మార్చిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మంచు మనోజ్ ఇటీవల వీరిద్దరి లైఫ్‌కు సంబంధించిన హ్యాపీ న్యూస్‌ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తాను తండ్రి కాబోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ పంచుకున్నాడు.

Manchu Manoj With His Wife Bhuma Mounika Reddy and Son Visuals @ Kurnool | Manastars - YouTube

తాజాగా మౌనిక తల్లి శోభ నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మంచు మనోజ్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాసుకొచ్చాడు. అత్తమ్మ శోభనాగి రెడ్డి గారి జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఓ హ్యాపీ న్యూస్ ను అందరితో పంచుకుంటున్న.. అత్తమ్మ నువ్వు, భూమా నాగిరెడ్డి మామ మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు కాబోతున్నారు. మా చిన్నారి ధైర్యబ్ చిట్టి అన్న కాబోతున్నాడు అంటూ రాసుకొచ్చాడు. పైనుంచి మీ ఆశీర్వాదాలు మాకు అందిస్తూ మా కుటుంబం ఎదుగుదలకు అనుక్షణం తోడుగా ఉంటారని నాకు తెలుసు.

Manchu Manoj: మౌనిక కొడుకు బాధ్యతపై మంచు మనోజ్ రియాక్షన్.. శ్రీవారి సాక్షిగా మనసులో మాట

మీ ప్రేమను మా పై ఎప్పుడు కురిపిస్తూనే ఉండాలి.. మా అమ్మ నిర్మల, నాన్న మోహన్ బాబు ఆశీస్సులతో కుటుంబ సభ్యులందరి ప్రేమలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటూ మంచు మనోజ్ తన హ్యాపీనెస్ అంతా ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ బుల్లితెర షో తో కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. ఉస్తాద్ అనే టీవీ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదేవిధంగా వాట్ ద ఫిష్ అనే సినిమాలో నటించడానికి మంచు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.