ఆరోజు రాత్రి నుంచే ‘ సలార్ ‘ హంగామా షురూ..

గతంలో ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచే సందడి ఉండేది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు షోలు వేసేవారు. కాలక్రమేణ‌ ఆ ట్రెండ్ ఆగింది. ప్రభుత్వాలు అనుమ‌తించ‌క‌పోవడంతో మిడ్ నైట్ షోలు ఆగిపోయాయి. మళ్ళీ ఇన్ని సంవ‌త్స‌రాల‌కు అటెండ్ తిరిగి వచ్చేలా కనిపిస్తుంది. తెలంగాణలో సలార్ సినిమా మిడ్ నైట్ షోలకు దాదాపు అనుమతి వచ్చేసింది. టికెట్ రేట్లు పెరగడంతో పాటు.. అర్ధరాత్రి నుంచి షోలు మొదలుపెట్టేలా తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చినట్లు టాక్.

Prabhas Salaar Digital Art" Poster for Sale by Abhitha Mohan | Redbubble

తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో 20 లొకేషన్లో ఈనెల 21 రాత్రి నుంచే సలార్ మిడ్ నైట్ షోలు పడిపోతున్నాయి. వీటిలో పది లోకేషన్లు హైదరాబాద్‌లో ఉండగా మిగతా పది సెంటర్లు పలు జిల్లాల్లో కేటాయించారట. నైజాంలో సలార్ సినిమాకు మిడ్ నైట్ షోలు పడబోతున్న విషయంపై హీరో నిఖిల్ ఈ విధంగా స్పందించాడు. ఎన్నో ఏళ్ల క్రితం మిర్చి సినిమాను హైదరాబాద్‌లో మిడ్ నైట్ షో చూసా. మళ్ళి ఇన్నేళ్లకు సలార్ సినిమాను రాత్రి 1:00 కు చూస్తా అంటూ వివరించాడు.

Vaartha Online Edition %%page%% %%primary_category%% _Nithin Interview Pics  | Vaartha

ఇక టికెట్ రేట్ల విషయానికి వస్తే ఆర్‌ఆర్ఆర్ కోసం కేటాయించిన రేట్లనే సలార్ కోసం కూడా ఫాలో అవ్వబోతున్నారట. మొదటి వారంతం ఆర్‌ఆర్ఆర్ సినిమాకు సింగిల్ స్క్రీన్ లో రూ.236 మల్టీప్లెక్స్ లో రూ.413 తీసుకున్నారు. ఆ తర్వాత వారం నుంచి రూ.212, రూ.354కు టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు ఇవే రేట్లను సలార్‌ సినిమా కోసం కూడా కేటాయించబోతున్నారట. ఇదే డేట్స్ ఫిక్స్ అయి.. మిడ్ నైట్ షో కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటిరోజు వసూళ‌తో స‌లార్‌ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం.