‘ సలార్ ‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ పిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..

ప్రభాస్, కేజిఎఫ్ సిరీస్‌ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ ఎత్తున పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సాలిడ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సలార్ ఓటీటీ రిలీజ్ సంగతేంటి అని సందేహాలు చాలామందిలో మొదలయ్యాయి.

ఇక‌ ప్రభాస్ హ్యాట్రిక్ ఫైల్‌య్యుర్స్‌తో డిలా పడిన ప్రభాస్.. ఈసారి ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ.. అంగు ఆర్భాటం లేకుండా సైలెంట్ గానే ఆట మొదలెట్టాడు. ఇక సలార్ కలెక్షన్లు వర్షాన్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఊచకోత మొదలైంది. ప్రభాస్‌కు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందిందని చెప్పాలి. ఇక కలెక్షన్లు బట్టి ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో సక్సెస్ అందిందో తెలుస్తుంది. సలార్ మాత్రం ప్రమోషన్ లేకుండా కామ్ గా వచ్చినా.. థియేటర్లో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది.

ఇక సలార్ బ్లాక్ బాస్టర్ అయిన నేపథ్యంలో ఈ సలార్ ఓటీటీ హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారు.. ఎంత‌కు అమ్ముడుపోయింది.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే అంశాలపై చర్చ మొదలైంది. అయితే సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ” నెట్‌ఫ్లిక్స్‌ ” సంస్థ రూ.160 కోట్లకు పైగా చెల్లించి మరి సొంతం చేసుకుందట. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కచ్చితంగా ఫిక్స్ కాలేదు. సినిమా వాళ్ళు పెట్టుకున్న రూల్ ప్రకారం అయితే ఏ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలన్నా మూడు నెలల తర్వాతే కుదురుతుంది.

కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా పెద్ద హీరోలు నటించి థియేటర్లలో.. ప్లాప్ అయిన సినిమాలు రెండు వారాలుకే ఓటీటీలోకి పంపిస్తున్నారు. చిన్న సినిమాలైతే అలా రిలీజై ఇలా ఓటీటీలో స్టీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ కొట్టిన సలార్ ఇప్పట్లో స్ట్రీమింగ్ అయ్యే పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే సలార్‌కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్ళని కూడా కొల్లగొడుతుంది. కన్నడ డైరెక్టర్, తెలుగు హీరో, మలయాళ యాక్టర్ కీలకపాత్రలో ప్లే చేయడంతో స‌లార్‌ బీభత్సవం సృష్టించడం ఖాయం అని అర్థమవుతుంది. దీంతో ఈ మూవీ పూర్తి వసూళ్ళు కొల్లగొట్టడం అయిన తరువాతనే ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.