“న్యూ బేబీ రాబోతుందోచ్”.. ఎగిరి గంత్తేసే న్యూస్ చెప్పిన కళ్యాణ్ దేవ్..!!

ఇది నిజంగా అభిమానులకి నవ్వాలో.. ఏడవాలో తెలియనటువంటి న్యూస్ . ఒకపక్క న్యూ బేబీ రాబోతుందోచ్ అని ఆనందపడాలో .. మరొక పక్క లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి ..? అని బాధ పడాలో తెలియక అల్లాడిపోతున్నారు . మొదట ఈ పేరుకి పెద్దగా పరిచయాలు లేకపోయినా.. సరే ఆ తర్వాత మాత్రం ఈ పేరుకి బాగానే పరిచయాలు ఏర్పడ్డాయి . మెగా డాటర్ శ్రీజ ను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి చాలా చాలా ట్రై చేశారు .

అయితే కళ్యాణ్ దేవ్ అనుకున్నంత స్థాయి అందుకోలేకపోయాడు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు. వీళ్ళు విడాకులు తీసుకున్నారా ..? లేదా అన్న సంగతి ఇంకా అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు. పరోక్షకంగా పెట్టే పోస్టులు మాత్రం వీళ్ళకి విడాకులు మంజూరు అయ్యాయని చెప్తున్నాయి . అయితే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ తన సిస్టర్ ప్రెగ్నెంట్ న్యూస్ బయట పెట్టాడు .

తన సిస్టర్ ప్రెగ్నెంట్ అంటూ చెప్పిన ఆయన త్వరలోనే న్యూ బేబీ రాబోతుంది అంటూ పోస్ట్ చేశారు . అంతేకాదు ఈ సీమంతపు వేడుకలలో పాల్గొన్న ఫొటోస్ కూడా షేర్ చేశారు . “మీ అందరి ప్రేమ అభిమానులతో నా కుటుంబం ఇంకా పెరుగుతుంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వేడుకలో కళ్యాణ్ దేవ్ కూతురు నిష్క కూడా పాల్గొనడం సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)