” ప్రియాంకతో అమర్ అలా ప్రవర్తించడం బాలేదు “… ప్రియుడు నీతులు.. ప్రియాంక కోతలు…!!

బిగ్ బాస్ 7 ప్రస్తుతం ఎంత రసవత్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. 26 మంది కంటెస్టెంట్ల తో స్టార్ట్ చేసిన ఈ షో లో…. ఆరుగురు మాత్రమే మిగిలారు. శివాజీ, అమర్, అర్జున్, ప్రియాంక, యావర్‌….. గ్రాండ్ ఫినాలే దసకు చేరుకున్నారు. ఇక ముఖ్యంగా ప్రియాంక జైన్ సీజన్ 7 లో వన్ అండ్ ఓన్లీ లేడీ ఫైనల్ హౌస్ మేట్ గా ఉండటం గమనార్హం.

అయితే ఒక సందర్భంలో అమర్.. ప్రియాంక పట్ల ప్రవర్తించిన తీరు నచ్చలేదంటూ తన ప్రియుడు శివకుమార్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో శివకుమార్ మాట్లాడుతూ.‌‌..” ప్రియాంక ,అమర్ దగ్గర…ఒకరిని ఒకరు గౌరవించుకునే తీరు నాకు బాగా నచ్చుతుంది. సీజన్ మొత్తంలో అమర్ను ప్రియాంక ఒక్కసారి నామినేట్ చేసింది. కానీ ఒక టాస్క్ లో ఇద్దరు మధ్య టఫ్ ఫైట్ నడిచింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో తమ వద్ద ఉన్న రింగ్ వేసి బాలు దగ్గరకు లాక్కోవాలి.

ప్రియాంక దగ్గర ఉన్న బాల్ ని అమర్ బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేశాడు. ప్రియాంక దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. కానీ అమర్, ప్రియాంకను గాల్లోకి ఎత్తి కింద పడేశాడు. అది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. అలాగే ఈ గేమ్ అయిపోయాక ప్రియాంక ఏడ్చింది కూడా. ఇక ఆ ఎపిసోడ్ చూసిన ప్రియాంక తల్లిదండ్రులు సైతం కంటతడి పెట్టుకున్నారు ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈయన వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” ప్రియాంక ప్రియుడు చెప్పేవి నీతులు… ప్రియాంక చేసేవి కోతలు ” … అంటూ కామెంట్లు చేస్తున్నారు.