ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి.. డార్లింగ్ ప్లాన్ అదిరిపోయిందిగా..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కే జి ఎఫ్ సిరీస్ లతో బ్లాక్ బాస్టర్ కొట్టిన ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా ప‌డిన‌ ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా సినిమాపై ఉన్న హైప్‌ రిత్యా వ్యూస్ బాగా వచ్చినా.. ప్రభాస్ రేంజ్‌లో ఎలివేషన్స్ లేవని.. ఎక్కువగా కేజీఎఫ్ ఛాయలే కనిపిస్తున్నాయంటూ విమర్శలు వచ్చాయి.

Salaar Photos, Poster, Images, Photos, Wallpapers, HD Images, Pictures -  Bollywood Hungama

ఈ ట్రైలర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతృప్తి చెందలేదు అన్నది వాస్తవం. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు కూడా ఇంకా మొదలు కాలేదు. ఎందుకు సలార్‌ టీం సైలెంట్ గా ఉన్నారని అంశంపై ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇంతవరకు మూవీ టీం మీడియా ముందుకు రాకపోవడంతో సినిమా పై ఉన్న హైప్ పడిపోవడం ఖాయమంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా సినిమా ఓపెనింగ్స్ పై కూడా ఈ ప్రభావం ఉంటుందని సినీ వర్గాల నుంచి టాక్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఎక్కించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్ సలార్ మూవీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

SS Rajamouli and Prabhas to team up again? - Hot buzz - Tamil News -  IndiaGlitz.com

ప్రశాంత్ నీల్‌, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ను.. రాజమౌళి ఇంటర్వ్యూలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ షూట్ ప్రారంభం కానందుట. గతంలో రాజమౌళి రాధేశ్యామ్‌ సినిమా కోసం ప్రభాస్‌ని ఇంటర్వ్యూ చేయడం చూసాం. ఇక రాజమౌళి ఫేవరెట్ హీరోల‌లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. బాహుబలి సిరీస్ లతోపాటు చత్రపతి సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇక ప్ర‌స్తుతం రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, సలార్ రెండో ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు.