నాగార్జున ” నా సామి రంగ ” మూవీ నుంచి రేపు అల్లరి నరేష్ ఇంట్రో గ్లింప్స్… ఇక మోత మోగాల్సిందే గా..!

కింగ్ నాగార్జున హీరోగా.. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది.

అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియన్స్ ని కొడుకుబ్బ నవ్వించనున్నాడట. ఈ పాత్రకి సంబంధించిన ఇంట్రో గ్లింప్స్ ను మేకర్స్ రేపు ఉదయం 10:18 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్లూరి నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలాగే అషికా రంగనాథ్ .. నాగార్జున సరసన నటించనుంది. ఇక ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.