ఆ స్టార్ హీరోయిన్ కాళ్లు మొక్కిన‌ రవితేజ, పూరి జగన్నాథ్… అంత పని చేశారేంట్రా అయ్యా…!!

” సూపర్ ” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క… మంచి పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో కాస్త హై గ్లామర్ రోల్స్ చేసిన ఆ తర్వాత నెమ్మదిగా స్టోరీ ప్రయారిటీ సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన ” అరుంధతి ” మూవీ అనుష్క కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో విక్రమార్కుడు, బాహుబలి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

ఇక ఇండస్ట్రీలో తన 15 సంవత్సరాల సిని జర్నీ పూర్తి చేసుకుంది. అనుష్క నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంచిదనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమె మంచితనం గురించి చూసాం.. విన్నాం కూడా. అయితే ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ” అందరూ అంటుంటారు అనుష్క మంచిది.. మంచిది అని. నిజంగా తాను చాలా మంచిది. ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

ఎంతలా అంటే నేను, ఛార్మి, రవితేజ తనని అమ్మ అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్లకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఎందుకంటే తనలోని లక్షణాలు మాకు కొన్ని అయిన రావాలని. చాలా మంచితనం తెలివి కలది అనుష్క ” అంటూ చెప్పుకొచ్చాడు పూరి. స్టార్ హీరో రవితేజ సైతం అనుష్క కాళ్లు పట్టుకునే అంత మంచిదట ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.