లెఫ్ట్ & రైట్ వాయించి ప‌డేసిన పూజా హెగ్డే… ఐ డోన్ట్ కేర్ ..!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించింది. వరుస‌ సినిమాలతో హిట్లు అందుకుంటూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకుంది కాగా తర్వాత అదే రేంజ్‌లో ఫ్లాప్ లు ఎదురవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది.

11 striking outfits that highlight Pooja Hegde's wedding guest style | Vogue India

ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూజ హెగ్డేను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని.. ఈ బ్యూటీకి లైఫ్ త్రెడ్ ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త పూజా హెగ్డే వరకు వెళ్లడంతో పూజా హెగ్డే టీం దీనిపై స్పందించారు.

Celebo - Beautiful Pooja Hegde | Facebook

పూజా హెగ్డేకు ఎలాంటి బెదిరింపులు రాలేదని.. ఇవన్నీ తప్పుడు వార్తలు అని ఎవ‌రు వాటిని న‌మ్మ‌వ‌ద్దు అంటూ వివ‌రించారు. ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేయవద్దు అంటూ పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వ‌డంతో ఈ బెదిరింపు వార్త‌ల‌కు తెర‌ప‌డింది.