Rana birthday spl : ‘ రాక్ష‌స రాజు ‘ గా రానా.. ప‌వ‌ర్ ఫుల్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు బ‌ర్త్‌డే ట్రీట్‌..

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోలలో రానా దగ్గుపాటి ఒకడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను, విలన్‌గాను తన పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అదేవిధంగా నిర్మాతగా మారి రాణిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో ఒక హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రానా ఉన్నట్లు తెలుస్తుంది.

నేనే రాజు నేనే మంత్రి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తేజతో మరోసారి జతకట్టబోతున్నాడు. ఇక ఈ రోజు రానా బర్త్ డే స్పెషల్ గా రానా – తేజ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి సూప‌ర్ ట్రీట్ ఇచ్చాడు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు. రాక్షస రాజు గా రానా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పోస్టర్లో రానా గన్ పట్టుకుని పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించాడు.

ఓ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుందని టాక్. ఇందులో రానా పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుందట. ఇప్పటివరకు నటించని ఓ కొత్త రోల్ లో రానా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రాక్షస రాజు రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటినటులు, సాంకేతిక నిపుణులు ఎవరని అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.