ఎర్ర అరటి పండ్లు తినడంవల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. తప్పక అలవాటు చేసుకుంటారు…!!

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే వాటిలో అరటిపండు ఒకటి. దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా కూడా సహాయపడుతుంది అరటిపండు. ఇక వీటిలో ఎర్ర అరటిపండు ఇంకా స్పెషల్. దీనిని తినడం వల్ల క్యాల్షియం నిండుగా అందుతుంది.

ఎర్ర అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మ రంధరాలు క్లియర్ అవుతాయి. ముఖ చర్మం అందంగా మెరుస్తుంది కూడా. అలాగే నెలసరి సమయంలో కడుపు నొప్పి తగ్గించడంలో ఈ అరటిపండు బాగా సహాయపడుతుంది. విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఇక ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎర్ర అరటిపండు తింటే రిలాక్స్ కూడా అవుతారు. అలాగే రేచీకటి ఉన్నవారు ఎర్ర అరటిపండు తింటే సమస్య తగ్గుతుంది కూడా. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర అరటిపండు చాలా బాగా సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు ఉన్న ఈ అరటిపండుని కచ్చితంగా తినాల్సిందే. తద్వారా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.