నాని జెర్సీ సినిమాను ఆ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడని తెలుసా..?

నాచురల్ స్టార్ నాని మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కూడా. ఇక నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో జెర్సీ ఒకటి.

ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో జెర్సీ సినిమా తెరకెక్కగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందడం గమనార్హం. అయితే ఈ సినిమా కథను ముందుగా మరో హీరోకి చెప్పాడట గౌతమ్ తిన్ననూరి. ఆ హీరో మరెవరో కాదు వెంకటేష్. అయితే వెంకటేష్ ఈ కథ విన్న తరువాత… తనకి ఈ సినిమా సెట్ అవ్వదని సున్నితంగా వదులుకున్నాడట.

ఇక విక్టరీ వెంకటేష్ ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇలా ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని వదులుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇక ప్రస్తుతం నాని తాజాగా నటిస్తున్న మూవీ ” హాయ్ నాన్న “. ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే ఇక నాని తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ నెల 7న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.