దగ్గుపాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయికి, శ్రీలీలకి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

దగ్గుబాటి అభిరామ్ మనందరికీ సుపరిచితమే. తాజాగాయిన పెళ్లికి రెడీ అయన సంగతి తెలిసిందే. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్‌ చేశారు. ఇక వీరంతా పెళ్లి కోసం శ్రీలంక వెళ్లారు. ఇక శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష పెళ్లి మూడు రోజులు అంగరంగ వైభోగంగా జరిగింది.

ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రామానాయుడు తమ్ముడి మనవరాలని.. వరుసకు మేన మరదలు అవుతుందని.. వీరిద్దరికీ ఎప్పటినుంచో ఒకరంటే ఒకరు ఇష్టమని సమాచారం. ఇక వీరి పెళ్లికి కేవలం 200 మంది మాత్రమే హాజరయ్యారట. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా తక్కువ మంది పెళ్లికి హాజరు కాగా వారిలో శ్రీ లీల మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం అభిరామ్ పెళ్లికి వెళ్లకుండా శ్రీ లీల వెళ్లడానికి కారణం ఏంటి అంటూ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఇక అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రత్యూష కి, శ్రీ లీలా కి మధ్య చిన్నప్పటి నుంచే చాలా మంచి స్నేహబంధం ఉందట. వీరిద్దరూ ఒకే దగ్గర చదువుకున్నారట కూడా. ఇందువల్లే శ్రీ లీల వీరి పెళ్లికి హాజరయ్యిందట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.