నాని ‘ హాయ్ నాన్న ‘ ఫ‌స్ట్ రివ్యూ… హిట్ కొట్టాడా నాని గాడు…!

నాచురల్ స్టార్ నానిగా పేరుపొందిన ఈయన ప్రస్తుతం నటించిన మూవీ ” హాయ్ నాన్న “. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక నాని సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి వెళ్లి చూసే లాగానే ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఇక ఇదే నమ్మకాన్ని నాని ఏమాత్రం స్పాయిల్ చేసుకోకుండా తండ్రి, కూతురుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు.

ఈ సినిమాలో తండ్రి, కూతురుల ప్రేమ శృతి మించేలా ఉంది. ఇక ఈ సినిమాలో దర్శకుడు శౌర్యువ్ పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ విషయంలో సక్సెస్ సైతం అయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమా కథని చూపించడం గమనార్హం. ఇక ఈ సినిమాని చాలా ఎమోషనల్ అండ్ లవ్ అండ్ అట్రాక్షన్ తో తీసుకెళ్లాడు.

ఇక ఈ సినిమా చూసిన కొందరు కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ఈ సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ కి మధ్య వచ్చిన సన్నివేశాలను చూసి అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర చిన్నది అయినప్పటికీ అభిమానులని చాలా బాగా ఆకట్టుకుంది. దసరా తరువాత మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు నాని. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి మరి.