ఆ ఒక సినిమా కార‌ణంగా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌..

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు ఫ్లాప్స్ ఎదురవుతాయో.. ఎవరు గ్రహించలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు భారీ సక్సెస్‌ అందుకుంటూ దూసుకుపోయిన హీరోలైన అతి తక్కువ కాలంలోనే ఫ్లాప్స్ బాట పట్టి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట హీరోగా నటించిన శ్రీకాంత్ తర్వాత ఇండ‌స్ట్రీకి దూరం అయ్యాడు. త‌ర్వాత రీ ఎంట్రి ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక తాజాగా కోటబొమ్మాలి పియ‌స్ సినిమాలో నటించి ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారు.

Mahathma (2009) | Cast & Crew | News | Galleries | Movie ...

ఇక తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను నటించిన మహాత్మ సినిమా తర్వాత.. వరుసగా 25 ఫ్లాపులు వచ్చాయంటూ కామెంట్లు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి పోటీ ఇస్తూ దూసుకుపోయిన శ్రీకాంత్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట‌ వైరల్ గా మారాడు. ఆమె సినిమా సక్సెస్ వచ్చిందని.. ఆ టైంలోనే తాజ్ మహల్, పెళ్లి సందడి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. ఆహ్వానం, వినోదం సినిమాలు కూడా సక్సెస్ అందుకున్నాయని కామెంట్లు చేశాడు.

Mahathma Songs Download - Free Online Songs @ JioSaavn

మహాత్మ సినిమా తర్వాత కెరీర్ పరంగా పెద్ద దెబ్బ తగిలిందని.. మహాత్మా మూవీ నా వందవ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా తర్వాత కెరీర్ నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైందని వివరించిన శ్రీకాంత్.. ఈ మహాత్మ సినిమా తరువాత నేను చేసిన పాతిక సినిమాలు పాపయాయి అంటూ వివరించాడు. ఆ సినిమా తరువాత నుంచి నా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని.. ఆయన కామెంట్ చేశాడు. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావడం కూడా అందుకు ఒక కారణం అంటూ వివరించిన శ్రీకాంత్.. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్నాడు. ఇక శ్రీకాంత్ న‌టిస్తున్న‌ ఈ సినిమాలన్నీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వేచి చూడాలి.