‘ ది గర్ల్ ఫ్రెండ్ ‘ సినిమా కోసం అలాంటి సాహసం చేయబోతున్న రష్మిక.. నీకు అవసరమా అంటూ..

తాజాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ఈ సినిమాతో ఆమె మార్కెట్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇందులో ఆమె నటన‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా నటిస్తుంది.

Rashmika Mandanna's next is titled 'The Girlfriend'! | Telugu Movie News -  Times of India

కాగా ఈ సినిమా ఓ డిఫ‌రెంట్ స్టోరీతో రూపొందుతుందట‌. ఈ మూవీ కోసం రష్మిక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందని టాక్. అయితే ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్‌ను వినగానే ఏదో లవ్ స్టోరీ గా ఉండబోతుందని అందరూ భావిస్తారు.. కానీ స్టోరీ అందుకు భిన్నంగా ఉండబోతుందట. చీ.లా.సౌ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్ర‌న్ ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలో రష్మిక మందన ఫైటింగ్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా నటించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్లో రష్మిక పాల్గొంటుందట.

Pic Talk: Rashmika Looking Ravishing In The Karate Outfit!

ఇక ప్రస్తుతం హైదరాబాద్ శివార్ల‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక నిన్న మొన్నటి వరకు ముంబై బెంగుళూరు లాంటి ప్రదేశాల్లో యానిమల్‌ను ప్రమోట్ చేస్తూ వచ్చిన నేషనల్ క్రష్‌ నేరుగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ సెట్స్ కు వచ్చినట్లు టాక్. మొదటి దశ షూటింగ్లో బ్యూటీ పాల్గొంద‌ట‌. మొదటి 20 రోజుల షూటింగ్లో యాక్షన్స్ స‌న్నివేశాలను రూపొందించబోతున్నారని తెలుస్తుంది. ఇందులో రష్మిక కూడా జాయిన్ అయింది. ది గర్ల్ ఫ్రెండ్ లో లవ్ స్టోరీ మాత్రమే కాకుండా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట.

Rashmika Mandanna – Filmy Glitz

ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో రష్మిక రూమర్డ్‌ బాయ్ ఫ్రెండ్ అయినా విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్. కాగా ఈ విషయంపై ఇప్పటి వరకు మూవీ టీం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రష్మిక యాక్షన్స్ సన్నివేశాల్లో కూడా నటించబోతుందంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో.. నీకు ఇలాంటి సీన్స్ లో నటించడం అవసరమా అంటూ.. ఇక ఇదొకటి మిగిలిందా తల్లి ఇది కూడా మొదలు పెట్టావా అంటూ.. నేటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.