సీఎంను చేయమన్న అందులో తప్పేముంది.. రైతు బిడ్డ షాకింగ్ కామెంట్స్ వైరల్..

బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. వినర్‌గా బయటకు వచ్చిన తరువాత ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలా మంది కంటెస్టెంట్స్ కార్ల‌పై దాడి చేసి నానా హంగామా చేశారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ బిగ్‌బాస్ విన్నర్ అయిన తర్వాత వచ్చిన ప్రైజ్ మనీ తో ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకుంటానంటూ స్టేజ్ పైనే అనౌన్స్ చేశాడు.

ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనని సీఎం చేస్తే మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 గ్రామాల వారిని ఆదుకుంటా అంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ప్రశాంత్ పై ఓ రేంజ్‌లో ట్రోల్స్ జరిగాయి. అయితే తాజాగా ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు. అవును సీఎం చేయండి అన్నా.. అందులో నాకు ఏమీ తప్పు కనిపించడం లేదు.. నాకు వచ్చిన రూ.35 లక్షలు 14 గ్రామాలకు సాయం చేయడానికి ఏ విధంగా సరిపోతుంది అంటూ ప్ర‌శ్నించాడు.

పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్: అసలు నిజం చెప్పిన హైకోర్ట్ లాయర్..  రేవంత్ రెడ్డిని లాగుతూ! | Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth  Missing.. High Court Lawyer ...

అదేమైనా పలహారమా కాస్త కాస్త పంచడానికి.. అసలు ఆ డబ్బుతో 14 గ్రామాల్లోకు వేటికి న్యాయం చేయలేను.. అందుకే నన్ను సీఎం చేయండి ఆ గ్రామాలను ఆదుకుంటా అన్నాను. దానిపై కూడా ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ నేను ఒకటే చెబుతున్నా.. బిగ్ బాస్ లో నాకు వచ్చిన ప్రతి రూపాయి రైతులకు ఇస్తా. అవి ఎలా ఖర్చు పెట్టానో వీడియో తీసి లెక్కలతో సహా మీ అందరికీ చూపిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. నేను బిగ్ బాస్ వెళ్ళింది నాకోసం కాదు.. రైతుల అంద‌రి త‌రుపునా ఆడా. రైతు బిడ్డగా వెళ్ళా.. నా పంట చేను సాక్షిగా చెబుతున్నా నాకు ఒక్క రూపాయి అవసరం లేదు. ప్రతి రూపాయి రైతులకు ఇస్తా అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.