డెవిల్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా.. ఈగోల‌తో నాకు క్రెడిట్ ఇవ్వ‌లేదు.. డైరెక్ట‌ర్‌ షాకింగ్ కామెంట్స్..

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన మూవీ డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులు ఎంతో ఆక‌ట్టుకున్నాయి. సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందా అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు అందరిలోనూ ఉన్నాయి. అయితే తాజాగా సలార్ మానియా కాస్త మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని ఆశ నందమూరి ఫ్యాన్స్ లో మొదలైంది. ఇక డెవిల్ మూవీ విషయానికి వస్తే మూవీకి సంబంధించిన ఎన్నో సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. అందులో మొదటిది డైరెక్టర్ పేరు ఎందుకు మార్చేశారు.

Kalyanram Nandamuri's Devil Movie Director Has Changed Producer Abhishek  Nama Replaced Naveen Medaram | Devil Movie: 'డెవిల్' కోసం మెగా ఫోన్ పట్టిన  ప్రొడ్యూసర్.. డైరెక్టర్ ను తప్పించారా ...

ఇక ఈ మూవీకి మొదట డైరెక్టర్ గా బాబు బాగా బిజీ మూవీ డైరెక్టర్ నవీన్ మేడారాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ తరువాత ఇతను ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇప్పుడు కంప్లీట్ గా పోస్టర్ నుంచి ఇతని పేరు తొలగించారు. డైరెక్టర్ ప్లేస్ లో కూడా నిర్మాత అభిషేక్ నామ పేరే కనిపించింది. ఈ విషయంపై హీరో కళ్యాణ్ రామ్ ని అడిగిన ఆ విషయంలో నిర్మాత క్లారిటీ ఇవ్వాలి అంటూ స్కిప్ చేశాడు. మరో పక్క ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగు సినిమా ఆటోగ్రాఫర్ సౌందర్య రాజన్ డైరెక్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. మొత్తానికి ఈ కన్ఫ్యూషన్ కి దర్శకుడు నవీన్ మేడారం తరలించాడు. తాజాగా అతను డెవిల్ గురించి ఓ ఎమోషనల్ పోస్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

Devil Credits - Naveen Medaram s Open Letter .

ఎమోషనల్ పోస్ట్ తో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని ఎంతో శ్రద్ధ పెట్టి రూపొందించా.. దాదాపు 105 రోజులు షూటింగ్లో పాల్గొన్న.. కొన్ని ప్యాచ్ వర్క్ లో మినహా మొత్తం సినిమాని నేను పూర్తి చేసేసా. సినిమా బాగా వచ్చింది. మౌనం చేతకానితనం కాకూడదని ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ పోస్ట్ చేస్తున్న. కొన్ని ఈగోల వల్ల నాకు క్రెడిట్ ఇవ్వకుండా నా పేరు తొలగించారు. అయితే హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు.. ఆయనకి నా ధన్యవాదాలు. నేను నా నెక్స్ట్ సినిమా పనులు స్టార్ట్ చేశా. డెవిల్ విషయంలో నేను ఎవరిపైన యాక్షన్ తీసుకోదల్చుకోలేదు అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం నవీన్ మేడారం చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.