2023 Pan Indian Movies: ఈ ఏడాది రూ.1000 కోట్ల కొల్లగొట్టిన పాన్ ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..

గతంలో ఇండియన్ మూవీ రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది చాలా గ్రేట్ రికార్డ్. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి చాలా భిన్నంగా మారింది. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ మూవీస్ అన్ని వేయి కోట్ల మార్క్‌ చాలా సులభంగా దాటేస్తున్నాయి. స్టార్ హీరో మూవీ.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలా సులువుగా ఈ సినిమాకు వెయ్యి కోట్ల మార్కు వచ్చేస్తుంది. అలా ఇప్పటికే బాలీవుడ్ నుంచి దంగల్, కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్, టాలీవుడ్ నుండి బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డులను సృష్టించాయి ఇక ఈ సంవత్సరం కూడా వెయ్యి కోట్ల సినిమాలు భారీగానే వచ్చాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

2023 సంవత్సరం మొదట్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ లో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్ రూపొందించిన స్పై థ్రిల్లర్ అయిన పఠాన్‌కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు చాలా కాలం నుంచి షారుక్‌కి సరైన హిట్ లేకపోవడంతో పఠాన్ మూవీ పై భారీ హైప్‌ నెలకొంది. దీంతో ఈ మూవీ ని చూసి ఎందుకు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపారు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూలు కాబట్టి వేయికోట్ల మార్క్‌ దాటిన సినిమాగా పాఠాన్‌ నిలిచింది.

తర్వాత షారుక్ హీరోగా వచ్చిన జవాన్ సినిమా కూడా ఇదే ఊపుతో వెయ్యికోట్ల కలెక్షన్లను రాబట్టింది. తమిళ్ డైరెక్టర్ అట్లి ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమా ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న సౌత్ బ్యూటీ నయన్ బాలీవుడ్‌కి పరిచయం అయింది. ఇక రిలీజ్‌కి ముందే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించిన విధంగానే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది.ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరబోతున్నాయని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

వాటిలో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ ఒకటి. అదేవిధంగా పన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సలార్, షారుక్ డంకీ సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో చేరే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక రణ్‌బీర్‌ కపూర్ యానిమల్ ఇప్పటికే రూ.700 కోట్ల గ్రస్స్ వసూలను కొల్లగొట్టింది. డిసెంబర్ చివరలో ప్రభాస్ నటించిన సలార్, షారుక్‌ నటించిన డంకి రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ రిలీజై ఫస్ట్ షో కి పాజిటివ్ టాక్ వస్తే చాలు కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ అవుతాయి. అలా ఒకే ఇయర్లో దాదాపు 5.. వెయ్యి కోట్ల సినిమాలు ఇండస్ట్రీకి అందబోతున్నాయి.