అదంతా ఫేక్… క్లారిటీ ఇచ్చి పడేసిన లోకేష్ కనగరాజ్….!!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న కొందరు టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్లలో కోలీవుడ్ లోకేష్ కనగరాజ్ ఒకరు. ఇక లోకేష్ తన కెరీర్ లోనే తెరకెక్కించిన నాలుగు సినిమాలతోనే తమిల్ నట స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇక లేటెస్ట్ గా ఈయన తెరకెక్కించిన ” లియో ” ఈయన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈయన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో హుషారుగా ఉంటారు.

ఇక తాజాగా ఈయనకి ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. లోకేష్ కనగరాజ్ తాలూకా ఫేస్ బుక్ అకౌంట్.. ఫేక్ అయినట్లుగా కొన్ని విజువల్స్ వైరల్ గా మారాయి. తన పేరు మార్చేసి వేరే పేరులోకి లోకేష్ ఎకౌంట్ మారింది. దీంతో అంతా లోకేష్ కనగరాజ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని అనుకున్నారు.

అయితే దీనిపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కేవలం ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లతో మాత్రమే అందుబాటులో ఉంటానని ఇంకే సోషల్ మీడియా మధ్యమంలో లేనని.. దయచేసి వాటిని ఫాలో అవ్వకండి.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీనిబట్టి ఈయన ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ అని క్లారిటీ వచ్చేసింది.ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.