నటి జీవిత రాజశేఖర్ పై ఫిలిం బోర్డుకు ఫిర్యాదు.. కారణమదే..?

సీనియర్ నటి జీవిత రాజశేఖర్ పైన ప్రముఖ నిర్మాత నటి కుమార్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీకి సైతం ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.. ఈమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్సి సభ్యత్వం నుంచి తొలగించాలంటూ కూడా ఫిర్యాదులో చేసినట్లుగా సమాచారం. వ్యూహం చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రిజెక్ట్ చేశారని విషయం తెలిసిందే.. దీంతో సెన్సార్ ఆర్ సికి ఈ సినిమాని రిఫర్ చేసినట్లు సమాచారం.

అయితే ఇందులో సెన్సార్ ఆర్ సి సభ్యులుగా ఉన్న నటి జీవిత రాజశేఖర్ వైసీపీ నేత అని అందుకే అక్కడే ఉండే ఈ సినిమాని సెన్సార్ పరంగా జరగనివ్వలేదని అందుకే ఈమెను ఈ సినిమా వరకు తాత్కాలికంగా సభ్యత్వం నుంచి తొలగించాలని కూడా నట్టి కుమార్ సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ కి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న సన్నివేశాల గురించి తెరకెక్కించారు.

వ్యూహం సినిమా వైయస్ జగన్కు పూర్తిగా అనుకూలంగా ఉండడంతో ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ సినిమా పైన వ్యయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇందులోని పాత్రలను వారి పోలికలకు దగ్గరగా ఉంటే నటీనటులను ఎంపిక చేశారని ఫైర్ అవుతున్నారు. తాజాగా వ్యూహం సినిమా టీజర్ ను చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తోంది. నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించినట్లు సమాచారం. దీంతో నిర్మాత నటి కుమార్ పూర్తిగా వ్యూహం సినిమా తెలుగు పొలిటికల్ ఫీచర్ అని ప్రస్తుతం తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేసినట్లు అయితే శాంతి భద్రతగా ఉండదని తెలుపుతున్నారు. అయితే తనపై వచ్చిన ఫిర్యాదు ప్రకారం జీవితం మాట్లాడుతూ ప్రస్తుతం తాను బిజెపిలో ఉన్నానని గతంలో వైసీపీలో పని చేశానని పార్టీతో తనకి ఎలాంటి సంబంధాలు లేదని.. వర్మ సినిమాలు అన్నీ కూడా మామూలు సినిమాలు చూసినట్లు చూస్తానని తెలిపింది.