మన భారతదేశంలో రాజకీయాలతో, సినిమాలు కలిసిపోయాయి. ఎందరో నటీనటులు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పాలిటిక్స్ లో పవర్ సాధించడానికి.. తమ సినిమా అభిమానులు సహాయపడతారు అనే ఒక్క ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది మాత్రమే ఆ విజయం సాధిస్తారు. అయితే కొంతమంది దక్షిణాదికి చెందిన సినీ నటులు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు సైతం అయ్యారు. అలా సినీ రంగం నుంచి రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా మారిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. సీఎన్ అన్నాదురై:
ఈయన తమిళ్ భాషలో ప్రముఖ రచయిత. ఈయన అనేక నాటకాలలో స్క్రిప్ట్ మరియు నటించేవారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి… తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
2. ఎం జి రామచంద్రన్:
ఈయన 1977 నుంచి 1987 లో మరణించే వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వాడు.
3. జానకి రామచంద్రన్:
ఈమె భర్త ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మరణించడంతో.. 23 జనవరి 1988న ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా 23 రోజులు పనిచేశారు. ఇమే తమిల్ సినిమా పరిశ్రమలో విఎన్ జానకిగా ప్రసిద్ధి చెందింది.
4. ఎన్టీఆర్:
ఈయన మొదట సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మూడు పర్యాయాలు ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
5. జయలలిత:
అమ్మగా పిలుచుకునే ఈమె.. 1991 నుంచి 2016 మధ్య 6 పర్యాయాలు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు.. ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇలా వీరి సత్తా సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో సైతం నిరూపించుకున్నారు. ప్రస్తుత కాలంలోనూ.. సినిమా రంగంలో నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కానీ కొందరికి విజయం దక్కుతుంది… మరికొందరికి మాత్రం నిరాసే మిగులుతుంది.