వామ్మో… చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద హెల్ప్ చేశారా… ఏ హీరో చేయకూడని త్యాగం…!!

మెగాస్టార్ చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూసి సురేఖ ని ఇచ్చి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం ఫేమస్ కమెడియన్ కు అల్లుడు, ఫేమస్ ప్రొడ్యూసర్ కు బావ.. సుప్రీం హీరో మెగాస్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయనపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నాటి నుంచి చౌదరిలే ఉండేవారు. అప్పటికి, ఇప్పటికీ హీరోలు కానీ, టెక్నీషియన్స్, దర్శకులు.. ఇలా చాలామంది చౌదరిలే ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో.. చిరు హీరోగా ఎదుగుతున్నాడు. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ సైతం అప్పటికే సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు.

మెల్లమెల్లగా చిరంజీవికి సైతం పాపులారిటీ రావడం మొదలైంది. పెద్దవాళ్లతో జాగ్రత్తగా లేకపోతే.. ఎదగడం కష్టమని అల్లు రామలింగయ్య భావించారు . ఆ సమయంలో ఎన్టీఆర్ తన కొడుకు బాలయ్యని పైకి తీసుకురావడం కోసం చిరును తొక్కేస్తాడేమో అని అల్లు రామలింగయ్య భావించి… నడుం బిగించాడు. ఆ తరువాత అల్లు రామలింగయ్య, చిరంజీవిని పిలిచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల వరకు ఎన్టీఆర్ గేటు బయట నిలబడు. 9999 అంబాసిడర్ లో ఆయన బయటకి వస్తారు. వెంటనే ఎన్టీఆర్ కు ఓ నమస్కారం చెయ్యి అని చెప్పాడట.

అలా మనవాడే పైకి వస్తాడని ఫీలింగ్ ఆయనలో కలుగుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నాడట అల్లు రామలింగయ్య. చాలా కాలం పాటు ఎన్టీఆర్ కు.. చిరు గుడ్ మార్నింగ్ చెప్పేవాడట. ఒకసారి వరదలు వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు..” జగదేక వీరుడు అతిలోకసుందరి ” టీం ఆయనకు ఎదురయిందట. బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టించనుంది అని పలకరించారట. ఈ విధంగా చిరంజీవి ఇండస్ట్రీలో పైకి వచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఎన్టీఆర్ కి కుల, మత భేదాలు లేవని తెలియజేశారు.