హీరో గోపీచంద్ మనందరికీ సుపరిచితమే. అలాగే వాళ్ళ నాన్న ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు… కానీ అప్పటి తరంలో ఈయన ఒక డైరెక్టర్. ఈయన పేరు తొట్టెంపూడి కృష్ణ. ఈయన పుట్టింది వరంగల్.. సినిమాల మీద ఆసక్తితో డిగ్రీ పూర్తయ్యాక మద్రాస్ వెళ్ళాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలకు సంబంధించిన అన్ని రంగాలలో అనుభూతి చెందాడు. రెడ్డి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. ఎంవి రాజన్ వద్ద ఎడిటింగ్ లో శిక్షణ తీసుకున్నాడు.
దాదాపు 30 కి పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశారు. అనంతరం డైరెక్షన్లోకి అడుగుపెట్టారు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయన.. ఈతరం అనే సొంత బ్యానర్ను కూడా ప్రారంభించాడు. ఈ బ్యానర్ పై కొన్ని మలయాళ సినిమాలను సైతం డైరెక్ట్ చేశాడు. ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ఉపాయంలో అపాయం
2. నేటి భారతం
3. దేశంలో దొంగలు పడ్డారు
4. దేవాలయం
5. వందేమాతరం
6. ప్రతిఘటన
7. రేపటి పౌరులు
ఇలా అనేక సినిమాలను చేసి తన సత్తా చాటుకున్నాడు. ఏదేమైనా ఈయన చేసిన సినిమాల పుణ్యమే… ఇప్పుడు గోపీచంద్ ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. ఇన్ని అద్భుతమైన సినిమాలు చేసిన కృష్ణ… ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం.