” నీ చెత్త పనులు చూస్తే జనాలు ఊస్తారు “… రతిక పై ఫైర్ అయిన అమర్…. నోరు జారినా కరెక్ట్ మాట్లాడావు అంటున్న ప్రేక్షకులు…!!

బిగ్ బాస్ 7 ఎవ్వరూ ఊహించని విధంగా ఉల్టా పుల్టాగా దూసుకుపోతుంది. గత వారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ కాగా… ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమైన వాళ్ళు… శోభ, రతిక, భోలె, తేజ, ప్రిన్స్, ప్రియాంక, అమర్దీప్, అర్జున్… మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించాడు బిగ్ బాస్.

ఈ క్రమంలోనే వీర సింహాలు , గర్జించే పులులుగా.. రెండు టీముల‌ను విభజించారు. ఇందులో భాగంగా అమర్ మరోసారి బూతులు వర్షం కురిపించాడు. ఆటలో భాగంగా తనకు కేటాయించిన బ్యాట్స్ను తీసుకోకుండా ఆపాడని రతిక అమర్ ని తిట్టడంతో.. అమర్ కి కోపం వచ్చింది. దీంతో ఆపోజిట్ టీమ్లో ఉన్న రతిక…” ఎందుకు వెధవ పనులు చేస్తావ్ ” అని నోరు జారింది.

దీంతో అమర్…” నువ్వు చేసిన పనుల కంటే కాదులే… అని ఏదో బూతు మాట్లాడి బయట ఊస్తారు ” అంటూ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పోటాపోటీగా మాటలు యుద్ధం జరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు…” అమర్ అంటే అన్నాడు కానీ… కరెక్ట్ చెప్పాడు. రతిక హౌస్ లో కి వచ్చినప్పటి నుంచి.. ఏమైనా చేసిందా. తిని.. పడుకోవడం తప్ప దానికి ఏమీ రాదు. దానిని త్వరలోనే ఎలిమినేట్ చేసేస్తాం ” అంటూ ఫైర్ అవుతున్నారు.