అమ్మ బాబోయ్…72 గంటలపాటు కేవలం పండ్లను మాత్రమే తింటే ఇలా జరుగుతుందా…!!

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మన ఆహారంలో కూరగాయలు, పండ్లను పుష్కలంగా చేర్చుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి మన ఆహార సమతూలంగా ఉండాలి. కూరగాయలు, పండ్లను ఇలా అనేక పోషకాలను తీసుకుంటూ ఉండాలి.

ఇక మూడు రోజులపాటు అంటే 72 గంటల పాటు కేవలం పండ్లను మాత్రమే తినేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు తదితరాలు అందుతాయని, జీర్ణశైలి పెరుగుతుందని, గుండె ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతాం. మనం పండ్లను తిన్న మొదటి రోజున.. మన శరీరం పండ్లను జీర్ణం చేసుకోవడం, పోషకాలను శరీరానికి అందించడం ప్రారంభిస్తుంది.

అదే సమయంలో పండ్లలోని పీచు కారణంగా కడుపు నొప్పిని దూరం చేసుకోవచ్చు. అలాగే రెండో రోజు మీ శరీరంలో కొవ్వును తగ్గించి మీరు సన్నగా అయ్యేలా చేసుకోవచ్చు. ఇక మూడో రోజు పండ్ల నుంచి అవసరమైన పోషకాలను పొందవచ్చు. ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క శక్తిని పొందుతూ పుష్కలంగా ఉండవచ్చు. ఇలా తరచూ పండ్లను తినడం వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకపోయినా.. శరీరానికి ఐరన్, క్యాల్షియం తగినంత మోతాదులో అందేందుకు ఉపయోగపడతాయి.