ఈసారి వరల్డ్ కప్ ట్రోఫీ 1987లో జన్మించిన కెప్టెన్ దే.. లిస్ట్ లో ఎవరున్నారంటే..?

మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలవుతుంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ గత ఎడిషన్ రనర్ ఆఫ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఐసీసీ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ అక్టోబర్ 5న జరగబోతుంది. ఈ క్రమంలో ఎప్పటికీ టాప్ 4 టీమ్స్ విజేతలపై విశ్లేషకులు సహా మిగతా అభిమానులు కూడా తమ అంచనాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్ స్టోన్ లోబో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అత‌డు మాట్లాడుతూ 1987వ సంవత్సరంలో పుట్టి ఇప్పుడు ఓ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఈ సారి వరల్డ్ కప్ గెలుస్తాడంటూ జోష్యం చెప్పాడు.

దీనికి ఉదాహరణగా 1986 – 87 లో జన్మించిన ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ నాయకులుగా ఉన్నవాళే మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్లో విజయాని అందుకుంటున్నారంటూ చెప్పుకొచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా తో మాట్లాడుతూ 1987లో పుట్టిన టెన్నిస్ సూపర్ స్టార్ నోవాక్ జోకోవిచ్, అలాగే 2018 ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ హ్యుగోలోరిస్, 2022లో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా సారధి లియోనల్ మెస్సి పేర్లను గుర్తుచేశాడు. ఇక క్రికెట్లో ఉదాహరణగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ పేరును అతడు ప్రస్తావించాడు. 1986లో జన్మించిన మోర్గాన్ 2019లో జట్టును జగత్విజేతగా నిలిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే క్రమంలో సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా 1987లో పుట్టిన వ్యక్తి కెప్టెన్ గెలుస్తారంటూ లోబో చెప్పాడు. షాకీర్ 1987లో జన్మించారు అయితే బాంగ్లాదేశ్ టీమ్‌ మరీ అంత చెప్పుకోత‌గ్గ‌విధంగా లేదు కాబట్టి 1987లో జన్మించిన మరో కెప్టెన్ దే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ అంటూ టీమిండియా సారధ‌ఙ‌ రోహిత్ శర్మ పేరును చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షాకీబ్ మార్చ్ 24, 1987లో జన్మించగా, రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987లో పుట్టాడు. ఇదిలా ఉంటే ఫోన్ లాండ్ పై టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత్ చెట్టు 2011 నాటి ఫలితాలు పునరావృతం చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. ఇక అక్టోబర్ 8న టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడబోతోంది.