సగం మంది పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యరు.. ఎందుకో తెలుసా…!!

దాదాపు 50శాతానికిపైగా యువత తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని.. వీరిలో 25% మంది పేరెంట్స్ కాల్స్ తిరస్కరిస్తారని తాజా అధ్యయనంలో వెళ్లడయింది. నిజానికి పదిమంది తల్లిదండ్రుల్లో ఏడుగురు పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు కాల్స్ ను ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కానీ 64% మంది కేవలం మెసేజ్ ల ద్వారానే రిప్లై పొందుతున్నారని గుర్తించింది.

ఇంతకు ముందు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతారని భయంతోనే అలా చేస్తున్నారని.. ఫోన్ రిసీవ్ చేయడం, రీకాల్ చెయ్యడాన్ని తిరస్కరిస్తున్నారని అధ్యయన శాఖ తెలిపింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయ్.. అని ముందుగా హెచ్చరించినప్పుడు మాత్రమే ఆన్సర్ చేస్తున్నారని తెలిపింది. 13 నుంచి 25 ఏళ్లు వయసున్న 1000 మంది పిల్లల తల్లిదండ్రులు.. 18 నుంచి 25 ఏళ్లు వయసున్న 1000 మంది GeN Zపై నిర్వహించిన పోల్ లో ఈ ఫలితాలను గుర్తించారు నిపుణులు.

అమ్మా, నాన్నల్లో నాలుగింట ఒక వంతు మంది తమ పిల్లలు తమను గందరగోళంలో ఉంచేందుకు కావాలని మెసేజ్ లో గందరగోళమైన యాసలను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నారు. అందుకే రిప్లయ్ ఇచ్చేముందు ఇంతకు ముందు మెసేజ్‌లో పిల్లలు ఉపయోగించిన యాస, సంక్షిప్త పదాలను వెతుకుతున్నారు. ఇక తల్లిదండ్రుల నుంచి ఓకే అని రిప్లై పొందినప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలు భయపడిపోతున్నారని.. ఒకవేళ ఎమోజిలు వాడితే నవ్వుకుంటున్నారని సర్వేలో తేలింది.