అక్కినేని మాజీ కోడలు తో అఖిల్ సినిమా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి అక్కడక్కడ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన విషయం ఏంటని విషయాన్ని ఎవరు తెలపలేదు. తాజాగా ఇప్పుడు సమంత గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారుతున్నది.

అదేమిటంటే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి సాలిడ్ హీట్ కొట్టిన సందర్భాలు లేని లేవు.. బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి.. అయితే సమంత, అఖిల్ మధ్య మంచి స్నేహబంధం ఉందనే విషయం అప్పుడప్పుడు వీరు పెట్టే పోస్టులను చూస్తే అర్థమవుతుంది. సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య , అమల నాగార్జున ఎవరు స్పందించలేదు. కానీ అఖిల్ మాత్రం గెట్ వెల్ సూన్ సామ్ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.

ఈ క్రమంలోని తన ఆరోగ్య విషయాలు పక్కన పెట్టి మరి తన మరిది కోసం సమంత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అఖిల్ నెక్స్ట్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఈమె నటించబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెలిసి పలువురు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తన అన్న మాజీ భార్యతో తమ్ముడు సినిమా ఏంటి పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.