” టైగర్ నాగేశ్వరరావు ” ప్రమోషన్స్ లో రవితేజ స్టంట్.. సినిమా కోసం అలాంటి రిస్క్ అవసరమా అంటూ..

మాస్ మహారాజు రవితేజ నటించిన దాదాపు అన్ని సినిమాలు మినిమమ్‌ ఎంటర్టైన్మెంట్ తో ఉంటాయి. గత కొన్ని నెలల నుంచి ఒక్క హిట్ కొడితే నాలుగు ఫ్లాప్స్‌ అనేలా రవితేజ పరిస్థితి తయారయింది. ధమాకాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం తొలి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా కుర్ర హీరోలా స్టంట్‌లు కూడా చేస్తున్నాడు. స్టువర్ట్పురం అనే ఊరిలో గజదొంగగా ఉన్న నాగేశ్వరరావు బయోపిక్ లో టైగర్ నాగేశ్వరరావు పేరుతో రూపొందిస్తున్నారు.

ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ట్రైలర్ కూడా డిఫరెంట్‌గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. వచ్చేవారం దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తెలుగు కంటే ఉత్తరాదిలో ప్రస్తుతం ప్రమోషన్స్ బిజీగా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోలో రవితేజ పాల్గొన్నాడు. డ్యాన్స్ చూసి స్టెప్పులేసి వెళ్లిపోకుండా చిన్న స్టంట్ కూడా చేశాడు మాస్ మహారాజ్.

సందర్భం సరిగ్గా తెలియకపోయినా బీర్ బాటిల్‌ తన చేతి పై పగలగొట్టుకున్నాడు రవితేజ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలానే అదే షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టితో కలిసి రవితేజ డ్యాన్సులు కూడా వేశాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా ప్రమోషన్స్ కోసం అలాంటి రిస్క్‌లు అవసరమా బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.