మరో బాలీవుడ్ హీరో సరసన రష్మిక.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక.. అల్లు అర్జున్ పుష్ప 2 బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపుర్ యానిమల్ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు సౌత్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న తర్వాత మొదటిసారి ఓ మీడియం హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. ఆ మీడియం హీరో ఎవరు.. ఆ ప్రాజెక్టు ఏంటి.. ఓసారి తెలుసుకుందాం. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు రణ్‌బీర్ కపూర్ జోడిగా నటించిన యానిమల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది.

తాజాగా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్లో మీడియా రేంజ్‌ హీరోగా ఉన్న విక్కీ కౌశల్ స‌ర‌సన రష్మిక నటించబోతుందట. ఉరి మూవీతో బాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వికీ కౌశల్ ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ వస్తున్నాడు. రీసెంట్‌గానే సారా అలీ ఖాన్ తో కలిసి జర హట్కే జర బచ్కే మూవీలో నటించి హిట్ కొట్టాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా రూ.150 కోట్లు భారీ బడ్జెట్ తో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ రూపొందుతుంది. చావా ది గ్రేట్ వారియర్ అనే టైటిల్ తో ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు.

ఇక వికీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో మొదటిసారి ఈ సినిమా రూపొందుతుంది. రాహుల్ జనార్ధన్ యాదవ్ ఈ పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ లీడ్‌ క్యారెక్టర్ కోసం రష్మిక మందన్నను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రష్మిక గతంలోనే బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించింది.. తాజాగా రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ లో నటించింది. ఇక ఇప్పుడు విక్కీ కౌశల్ తో నటించబోతుంది. బాలీవుడ్ లో రష్మికకు ఉన్న క్రేజ్ రీత్యా బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో మిడిల్ రేంజ్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.