సీనియర్ హీరోలకే సాధ్యంకాన్ని రికార్డును క్రియేట్ చేయబోతున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను ఈ మధ్యకాలంలో అందుకుంటూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోగా కొనసాగిన బాలయ్య ఇలాంటి క్రమంలోనే ప్రతి సినిమాని కూడా విజయాన్ని అందుకుంటూ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది.

Here is the title of Balakrishna-Anil Ravipudi's movie - Telugu News -  IndiaGlitz.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి పాజిటివ్ వైబ్స్ వినపడుతూ ఉన్నాయి.. ఈ సినిమా ట్రైలర్ను చూసిన చాలా మంది ప్రేక్షకులు సైతం ఇందులో బాలయ్య ఒక సరికొత్త క్యారెక్టర్ తో కనిపించబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కూడా ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు అభిమానులు హ్యాట్రిక్ హిట్ బాలయ్య అంటూ తెలుపుతున్నారు. బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి తర్వాత ఈ సినిమాతోనే సక్సెస్ కొట్టి ఇండస్ట్రీలో ఇప్పుడు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటున్న సీనియర్ హీరోగా గుర్తింపు పొందబోతున్నారు.

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఒకవేళ విజయం సాధిస్తే బాలయ్యకి ఇక ఇండస్ట్రీలో తిరుగు ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వయసులో కూడా బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉండడమే కాకుండా తనకు తగ్గ పాత్రలలో నటిస్తూ అభిమానులను మెప్పిస్తూ బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలతో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి.