నాని ” హాయ్ నాన్న ” టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్… అవేంటంటే..!!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శౌరవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. బిగినింగ్ నుంచి అందరిలో మంచి హైప్ ఏర్పరచుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, రెండు సాంగ్స్ నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని రేపు ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

తండ్రి కూతురి సెంటిమెంట్‌తో పాటు ఆకట్టుకునే యాక్షన్, లవ్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర చేస్తుండగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ని వైరా ఎంటర్టైన్మెంట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.