మూవీ లవర్స్ కు పివిఆర్ అదుర్స్ ఆఫర్.. రూ.700 కి పది సినిమాలు..

కరోనా మహమ్మారి భారతదేశం పై య‌టాక్ చేయడంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది. దీనిలోనే సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా థియేటర్ రంగంపై పడిన ప్రభావం కారణంగా ఓటీటీ రంగులు శ‌రవేగంగా దూసుకుపోతూ థియేటర్లలో ప్రేక్షకులు లేక విల‌విల‌లాడుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఇప్పటికి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ వేదికల పైన రిలీజ్ అవుతున్నాయి.

థియేటర్లకు వచ్చి నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేయడంతో థియేటర్ల వైపు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడంతో దీనికి చెక్ పెట్టేందుకు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ అయినా పివిఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు అదిరిపోయే ఆఫ్టర్ ప్రకటించింది. సాధారణంగా మల్టీప్లెక్స్ లో చూడాలంటే కనీసం రూ. 300 అయినా పెట్టాలి. అయితే పివిఆర్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ కేవలం రూ. 70 తోనే ఐనాక్స్ చూసే అవకాశం కల్పిస్తుంది. రూ 700 చెల్లిస్తే పది సినిమాలు చూసే అవకాశం కల్పించింది.

ఈ లెక్కన ఒక్కో సినిమాకు అయ్యే ఖర్చు రూ.70 మాత్రమే. ఈ ఆఫర్ (అక్టోబర్ 16) రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా రూ.700 చెల్లిస్తే 30 రోజులు వాలిడిటీతో పది సినిమాలు చూడొచ్చు. ఇది కేవలం వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఫిర్యాదు చెందిన ఏ థియేటర్లోనైనా ఈ వ్యాలిడిటీలో సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఉండడం.. కొత్త మూవీస్ రిలీజ్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పివిఆర్ ఈ ఆఫర్ ని తీసుకురావడం సినీ ప్రేక్షకులకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇలాంటి ఆఫర్ గతంలో కూడా ఓసారి తీసుకువచ్చింది పివిఆర్.