నేను ఏ తప్పు చేయలేదు.. మీడియా ఎదుట గుక్క పెట్టి ఏడ్చేసిన నిర్మాత..!!

సినీ నిర్మాత రవీందర్ ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన రవీందర్ మీడియా ఎదుట తన ఆవేదనను పంచుకున్నాడు. తను ఏ తప్పు చేయలేదని.. ఓ వ్యక్తి అక్రమ కేసు పెట్టి తనను జైలుకు పంపించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన శరీరం సహకరించకపోయినా పోలీసులు నేలపై కూర్చో పెట్టే వారిని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2020 సెప్టెంబర్ 17న నిర్మాత రవీందర్.. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని చెన్నై కి చెందిన బాలాజీ దగ్గర రూ.15.83 కోట్లు తీసుకున్నాడు.

అయితే అది మోసపూరిత ప్రాజెక్ట్ అని ఆలస్యంగా తెలుసుకున్న బాలాజీ తన డబ్బులు తనకు కావాలని కోరినా.. రవీందర్ పట్టించుకోకపోవడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.