అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో సినిమా పై మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
బాలయ్య నుండి ఫ్యాన్స్ మరియు మాస్ ఆడియన్స్ ఎక్స్ పెర్ట్ చేసే ఎక్స్ లెంట్ ఫైట్ సీన్స్ ఈ సినిమాలో భారీగానే ఉన్నాయట. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది భారీ ఫైట్ సీన్స్ ను పెట్టాడట అనిల్ రావిపూడి. ఇక ఆ యాక్షన్ సీన్స్ లో బాలయ్య వెండితెరపై బీభత్సం సృష్టిస్తాడని.. ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాడని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని సమాచారం. కాగా, వరుసగా రెండు హిట్స్ అందుకున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్నాడు. మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటూ మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.