82 ఏళ్ళ వయసులోనూ జిమ్‌లో చెమ‌ట‌లు చిందిస్తున్న యాంక‌ర్ సుమ త‌ల్లి.. వీడియో చూస్తే షాకే!

టాలీవుడ్ లో గత కొన్నేళ్ల‌ నుంచి నెంబర్ వన్ యాంకర్ గా చక్రం తిప్పుతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన సుమ మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. సుదీర్ఘకాలం నుంచి యాంకర్ గా సత్తా చాటుతూ తెలుగు వారి గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకుంది.

ఇప్పటికీ వరుసగా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలు మరియు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తుంది. అయితే సుమ ఈ స్థాయిలో ఉంది అంటే దాని వెన‌క ఆమె త‌ల్లి ప్రోత్సాహం, క‌ష్టం ఎంతో ఉంది. సుమ కూడా అనేకసార్లు ఈ విష‌యాన్ని ఒప్పుకుంది. గ‌త కొన్నేళ్ల నుంచి సుమ త‌ల్లి కూతురుతో పాటే ఉంటున్నారు. సినిమా ఈవెంట్స్‌, టీవీ షోల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే తాజాగా సుమ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో త‌ల్లికి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది.

ఈ వీడియో చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఎందుకంటే, 82 ఏళ్ల వ‌య‌సులోనూ సుమ త‌ల్లి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చెమ‌ట‌లు చిందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనే సుమ అంద‌రితో పంచుకుంది. `మా అమ్మను చూడండి.. ఆమెకు 82.. ఏ ఒక్క రోజు కూడా జిమ్, వర్కౌట్లు మానయేలేదు..` అంటూ తన తల్లి గురించి చెబుతూ సుమ అందరిలోనూ స్పూర్తిని నింపింది. ప్ర‌స్తుతం సుమ త‌ల్లి జిమ్ వీడియో వైర‌ల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)